అనువాద చిత్రం 'వ్యాపారి' ద్వారా సక్సెస్ ఫుల్ నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ ఇప్పుడు ప్రణతి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.2గా 'చిరుత పులిని' సమాయత్తం చేస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'సింగ కుట్టి' చిత్రాన్ని 'చిరుత పులి' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రంలో నడిగర తిలగం శివాజీ గణేషన్ మనువడు జూనియర్ శివాజీ గణేషన్ హీరోగా నటించడం విశేషం. అతనికి జోడిగా గౌరీ ముంజల్ ('బన్నీ' ఫేమ్) నటించింది. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు శ్రీ స్టూడియోలో బుధవారం ప్రారంభమయ్యాయి.కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ సంస్థ తొలి ప్రయత్నంగా అందించిన 'వ్యాపారి' చిత్రం డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి ఎగ్జిబిటర్ల వరకూ మంచి లాభాలు తెచ్చిపెట్టిందనీ, అదే కోవలో తమ సంస్థ నుంచి వస్తున్న మరో మంచి చిత్రం 'చిరుతపులి' అనీ చెప్పారు. ఇందులో శివాజీ గణేషన్ మనువడు జూనియర్ శివాజీ గణేషన్, గౌరీ ముంజల్ హీరోహీరోయిన్లుగా నటించారని చెప్పారు. అమ్మ కావాలా? దేశం కావాలా? అంటే నా మాతృదేశం కావాలని చెప్పే పాత్రను శివాజీ గణేషన్ అద్భుతంగా పోషించారని అన్నారు. ప్రసన్న కుమార్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలుస్తుందనీ, యాక్షన్ చిత్రాల దర్శకుడుగా పేరున్న ఎ.వెంకటేష్ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారనీ చెప్పారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్.డి.రాజశేఖర్ ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ ను చక్కగా ఆవిష్కరించారని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయనీ, ఆడియో త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
No comments:
Post a Comment