ఆంధ్ర్రప్రదేశ్ లో ఎప్పటికప్పుడు మారుతున్నరాజకీయ పరిస్థితులు, ఉద్వేగాలు, బంద్ ల ప్రభావం ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమను నష్టాల వైపు మళ్లిస్తోంది. ఇటీవల వరుసగా రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణా బంద్ ప్రభావంతో రీజియన్ లోని దాదాపు 500 థియేటర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. కొన్ని మూత దశగా కూడా ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు కూడా వచ్చాయి. రెండు రోజుల్లో 3 కోట్ల వరకూ ఎగ్జిబిటర్లు నష్టపోయారు. తాజగా ఇప్పుటికే విడుదల తేదీలు ప్రకటించుకుని ప్రచారానికి కూడా వెళ్లిన పలు చిత్రాలు రిలీజ్ తేదీలు మార్చుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ చేసేందుకు ఇష్టంలేకనే పలువురు నిర్మాతలు ఈ నిర్ణయానికి వస్తున్నారు. ఈ శుక్రవారం విడుదల కావాల్సిన విష్ణు 'సలీమ్' చిత్రం ఇప్పటికే వాయిదా పడింది. కొత్త తేదీని తర్వాత ప్రకటించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం 'కథ' చిత్రం కూడా 12న విడుదల కావడం డౌటేనని తెలుస్తోంది.
జస్ట్ ఎల్లో పతాకంపై 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు' వంటి హిట్ చిత్రాలను అందించిన గుణ్ణం గంగరాజు జస్ట్ ఎల్లో సినిమా పతాకంపై రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా 'కథ' చిత్రాన్ని నిర్మించారు. యూత్ ఫేవరెట్ హీరోయిన్ జెనీలియా, కొత్త నటుడు అరుణ్ జంటగా శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తొలుత ఈ చిత్రాన్ని ఈనెల 11న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ చివరకు 12వ తేదీని ఖరారు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ తేదీ కూడా మారే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర నిర్మాతలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
No comments:
Post a Comment