'బిందాస్' షీనాకు పెళ్లైందా?

బాలీవుడ్ భామలకు తెలుగు పరిశ్రమ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటుంది. ఎక్కువ మంది మోడలింగ్ నుంచి వచ్చిన వాళ్లే కావడంతో సహజంగానే వీరికి బెరుకు ఉండదనీ, గ్లామర్ ప్రదర్శనకు హద్దులు గీసుకుని కూర్చోరని ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ నమ్ముతుంటారు. సహజంగా ఈ హీరోయిన్లు పద్దెనిమిదేళ్ల పరువంలో సింగిల్ స్టాటస్ తో అడుగుపెట్టే వాళ్లే ఎక్కువ కాబట్టి యూత్ ను సమ్మోహన పరిచే శక్తి ఉంటుందనీ, ఇది తమ చిత్రాలకు కాసులు పండటం ఖాయమనీ భావిస్తుంటారు. మంచు మనోజ్ కుమార్ కథానాయకుడుగా నటిస్తున్న 'బిందాస్' చిత్రం ద్వారా ఇప్పుడు షీనా షహబది అనే బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిచయమవుతోంది. షీనా మరెవరో కాదనీ, బాలీవుడ్ సీనియర్ నటి సాధన కుమార్తె అనీ ఇటీవల వరకూ చాలామందికి తెలియదు. ఆనూహ్యంగా ఇప్పుడు షీనా స్టాటస్ సింగిల్ కాదనీ, ఆమె కొద్దికాలం క్రితమే సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందంటూ బలమైన ప్రచారం జరుగుతోంది.షీనా తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే ఈ వివాహం చేసుకుందనీ, అయితే పెళ్లి చేసుకుని తప్పుచేశానని గ్రహించిన షీనా ఆ తర్వాత అతనికి చెల్లుచీటీ చెప్పి నటనను సీరియస్ గా తీసుకుందనీ అంటున్నారు. షీనా సైతం ఈ విషయాన్ని కొద్దికాలం క్రితమే బాలీవుడ్ మీడియా ముందు ఒప్పుకుందట. అయితే ఈ వార్తను ప్రచారం చేసిన కొందరు షీనా, సదరు యువకుడు పెళ్లి చేసుకున్న ఓ ఫోటో కూడా బయటకు తీసుకు వచ్చి తమ వాదనను మరింత బలపరుచుకోవడం విశేషం. మరోవైపు ఇటీవలే విడుదలైన 'బిందాస్' స్టిల్స్ లో షీనాను చూసిన వాళ్లు మాత్రం అవునా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. షీనా నిజంగానే పెళ్లి చేసుకుందా..గాసిప్ స్టంటా అనేది ప్రస్తుతానికి మాత్రం మిస్టరీనే...

No comments:

Post a Comment