సినిమా సినిమాకూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుని సక్సెస్ గ్రాఫ్ ను నిలకడగా ఉంచుకుంటున్న హీరోల్లో వెంకటేష్ దే టాప్ ప్లేస్. 'అడవారి మాటలకు అర్ధాలు వేరులే', 'చింతకాయల రవి' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల తర్వాత విక్టరీ వెంకటేష్ మరోసారి 'నమో వెంకటేశ' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం తర్వాత వెంకటేష్ మరోసారి మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనున్నారు. కొరియాగ్రఫీ నుంచి దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. దీనికి 'గంగ' అనే టైటిల్ నిశ్చయించారు. ఇందులో వెంకటేష్ తొలిసారిగా నెగెటివ్ టచ్ ఉన్న డాన్ పాత్రను పోషించబోతున్నారు. ఈ చిత్ర కథను ఇంతవరకూ బయటకు వెల్లడించనప్పటికీ, సంఘ వ్యతిరేక శక్తులు, గ్యాంగ్ వార్ ల నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందనీ, చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయి డాన్ గా మారిన వెంకటేష్ తిరిగి తన గ్రామానికి వచ్చి అక్కడి ఫ్యాక్షన్ రాజకీయాలను సమర్ధవంతంగా ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందనీ తెలుస్తోంది. వెంకటేష్ సరసన ఒక కొత్త హీరోయిన్ ను ఎంపిక చేయనున్నారు. కోన వెంకట్ సంభాషణలు, స్క్రీన్ ప్లే అందించనున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జి, డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించనున్నారు
No comments:
Post a Comment