'2012' సంచనల విజయంతో మళ్లీ పలు హాలీవుడ్ చిత్రాలు తెలుగులోకి అనువాదమవుతున్నాయి. చైనాలో ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన '3 కింగ్ డమ్స్' చిత్రాన్ని 'యుద్ధభూమి' అనే పేరుతో తాజాగా తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈమధ్యనే '16 డేస్' చిత్రాన్ని అందించిన ప్రముఖ నిర్మాత డి.వై.చౌదరి, పి.మహేష్ బాబు ఈ చిత్రాన్ని కాస్మోస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.నిర్మాత చౌదరి చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'చైనీయుల అతి ప్రాచీన నవలల్లో...రొమాన్స్ ఆఫ్ ది 3 కింగ్ డమ్స్ ఒకటి. ఈ కథ చైనా చీకటి కాలాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అక్కడ అవగాహన లేని 3 రాజ్యాలకు చెందిన రాజుల వల్ల ఏర్పడిన దురదృష్టకరమైన సంఘటన వల్ల దేశం మూడు శత్రు రాజ్యాలుగా విడిపోతుంది. ఈ పరిస్థితుల్లో అతి సామాన్యుడైన జాహుజీలాంగ్ అనే వ్యక్తి దేశ ఐక్యత, శాంతి కోసం ఏవిధంగా పాటుపడ్డాడనేదే ఈ చిత్రం' అని చెప్పారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. మ్యాగీక్యూ, యాండీలా, సామోహుమ్, యాండియాస్, వెన్సేల్ తదితరులతో పాటు వేలాదిమంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో నటించారు. రాజశ్రీ సుధాకర్ సంభాషణలు అందించిన ఈ చిత్రానికి శామో హంగ్ యాక్షన్ , డానితుల్ లీ కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం అందించారు.
No comments:
Post a Comment