స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషలో డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'వరుడు'. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. సమ్మర్ కానుకగా మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు.
చిత్రం ప్రోగ్రస్ ను గుణశేఖర్ వివరిస్తూ, అల్లు అర్జున్ ఇంతవరకూ చేసిన క్యారెక్టర్లకు భిన్నంగా ఓ వైవిధ్యమైన పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారనీ, ఆయన నటనకు సినిమాకు హైలైట్ అవుతుందనీ చెప్పారు. తమిళ హీరో ఆర్య ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అల్లు అర్జున్-ఆర్య పాల్గొన్న క్లైమాక్స్ ఫైట్ ను ఇటీవల 15 రోజుల పాటు స్టన్ శివ నేతృత్వంలో చిత్రీకరించామని చెప్పారు. ఈ ఫైట్ సినిమాకి హైలైట్ అవుతుందనీ అన్నారు. ఓ కొత్తమ్మాయిని ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ వంటి అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయనీ, అందుకు తగ్గట్టుగా మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ చెప్పారు. ఫిబ్రవరిలో ఆడియో, మార్చి 26న సమ్మర్ స్పెషల్ గా సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. రెండు పాటలు, ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయినట్టు చెప్పారు. 'దేశముదురు' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత తమ బ్యానర్ నుంచి అల్లు అర్జున్ తో చేస్తున్న చిత్రమిదనీ, అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ అత్యద్భుతంగా తీస్తున్నారనీ చెప్పారు. సమ్మర్ కు రిలీజయ్యే ఈ చిత్రం పెద్ద హిట్టవుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, ఆంథోని ఎడిటింగ్ అందిస్తున్నారు.

No comments:
Post a Comment