1న వస్తున్న 'దమ్మున్నోడు'

కొత్త సంవత్సరం తొలిరోజున పలు చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో రిషి ('భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' ఫేమ్) కథానాయకుడుగా నటించిన 'దమ్మున్నోడు' సైతం ఉంది. యుకె ఎవెన్యూస్ కు చెందిన ఉదయ్ కిరణ్ సమర్పణలో లచ్చురామ్ ప్రొడక్షన్ పతాకంపై ఎ.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. బివివి చౌదరి దర్శకుడు. రిషికి జోడిగా సౌమ్య నటించింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయనున్నట్టు నిర్మాత రాజు తెలిపారు.హై ఓల్జేజ్ యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందినట్టు ఆయన చెప్పారు. ఈ చిత్రంతో రిషికి యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ వస్తుందనీ, ఇందులోని ఏడు ఫైట్లు మాస్ ను ఎంతో ఆకట్టుకుంటాయనీ అన్నారు. కథాపరంగా ఇందులో మాగంటి సుభాష్ చంద్రబోస్ అనే యువకుడికి పోలీస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యం ఉంటుంది. ఇందుకోసం పల్లెటూరి నుంచి నగరానికి వస్తాడు. తన ఆవేశాన్ని, ఆలోచనల్ని రంగరించి ఎస్.పి.స్థాయికి ఎదుగుతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో యుక్త, నాజర్, రాహుల్ దేవ్, రామిరెడ్డి, సత్యప్రకాష్, నరసింహరావు, హరిత, శ్వేత, శోభ తదితరులు నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

No comments:

Post a Comment