'ఓ వర్షం కురిసిన రాత్రి' 1న

కొత్తదనంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఇటీవల కాలంలో మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఆ తరహాలోనే 'ఓ వర్షం కురిసిన రాత్రి' చిత్రం కూడా యువతన ఆకట్టుకుంటుందని చిత్ర నిర్మాత ఎం.శ్రీరాములు తెలిపారు. వైభవ్, సారా జంటగా ఎస్.రమేష్ దర్శకత్వంలో స్వస్తిక్ ఫిలిం కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ చిత్రం తుదిమెరుగుల దశలో ఉంది. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు.ఓ వర్షం కురిసిన రాత్రి ఒక యువతికి ఎదురైన సంఘటన ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందిందని ఆయన తెలిపారు. విభన్నమైన కథంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలోని సస్పెన్స్ అందర్నీ ఆకట్టుకుంటుందనీ, ముఖ్యంగా యువతను ఆకట్టుకునే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో షకీలా, సుమన్ శెట్టి, గుండు హనుమంతరావు, మేల్కొటి తదితరులు నటించారు. విద్యానంద్ సినిమాటోగ్రఫీ, బాబు ఎడిటింగ్, నరేష్ సంగీతం అందించారు.

No comments:

Post a Comment