'కాస్కో' రిలీజ్ 18న

గొడవ' చిత్రంతో హీరోగా పరిచయమైన ఎ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్, 'కొత్త బంగారులోకం', 'రైడ్' చిత్రాలతో యువ హృదయాలను ఆకట్టుకున్న గ్లామర్ నటి శ్వేతాబసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'కాస్కో'. కె.ఫిలింస్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి సమర్పణలో ఎ.భారతి ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.

సీత జాడ తెలుసుకునేందుకు రావణుని వెతుక్కుంటూ రాముడు వెళ్లినట్టు ఇందులో కథానాయకుడు కూడా ప్రతినాయకుడి కోసం వెతుక్కుంటూ వెళ్తాడనీ, ఆపదలో చిక్కుకున్న ప్రియురాలని కాపాడేందుకు ప్రియుడు చేసే ప్రయత్నాలే ఈ చిత్ర ఇతివృత్తమనీ దర్శకుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు. వైభవ్ కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుందనీ, ఈ చిత్రంతో దర్శకుడుగా తనకు సరైన బ్రేక్ వస్తుందనే గట్టి నమ్మకం ఉందనీ అన్నారు. నాగేశ్వరరెడ్డి మార్క్ వినోదంతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న చిత్రమిదని కోదండరామిరెడ్డి తెలిపారు. ఈ చిత్రంతో వైభవ్ కు మంచి మాస్ హీరో ఇమేజ్ వస్తుందనీ, శ్వేతబసు గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందనీ అన్నారు. అలాగే బ్రహ్మానందం ఈ చిత్రంలో ఎక్కువ నిడివి ఉన్న పాత్రను పోషించి నవ్వులవినోదం పంచుతారని అన్నారు. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోందన్నారు. ఈ నెలలోనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గౌరీపండిట్, ప్రదీప్ రావత్, సలీమ్ పాండ, సలీమ్, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, చలపతిరావు తదితరులు నటించారు. గోపీ మోహన్ స్క్రీన్ ప్లే, రవి సంభాషణలు, అఖిలన్ సినిమాటోగ్రఫీ, రామ్ లక్ష్మణ్ -సెల్వ ఫైట్స్, ప్రేమ్ జీ సంగీతం అందించారు.

No comments:

Post a Comment