'లక్ష్మీకల్యాణం'తో పరిశ్రమలోకి అడుగుపెట్టి 'చందమామ'తో తొలి సక్సెస్ ను సాధించిన కాజల్ కెరీర్ 'మగధీర' సంచలన విజయంతో తారాజువ్వలా అగ్రపథాన దూసుకుపోతోంది. పలువురు అగ్రహీరోలు, దర్శకుల చిత్రాలతో కాజల్ ప్రస్తుతం బిజీగా ఉంది. 'ఆర్య-2'లో అల్లు అర్జున్ సరసన, 'డార్లింగ్' లో ప్రభాస్ సరసన నటిస్తున్న కాజల్ ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తదుపరి చిత్రమైన 'చండి'లో టైటిల్ రోల్ పోషించనుంది. తాజాగా యంగ్ స్టార్ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశాన్ని కాజల్ దక్కించుకుంది. ఎన్టీఆర్ తదుపరి చిత్రమైన 'బృందావనం'లో కాజల్ కథానాయికగా ఎంపికైంది. ఎన్టీఆర్ తో కాజల్ నటించనుండటం ఇదే ప్రథమం. తొలుత నాయిక పాత్రకు త్రిషను ఎంచుకున్నారు. అయితే ప్రస్తుతం త్రిష బాలీవుడ్ లో తొలిసారిగా ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తున్న 'కట్టామీటా' చిత్రానికి కాల్షీట్లు ఇచ్చి ఉంది. దీంతో ఆమె 'బృందావనం' చిత్రానికి కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోయింది. ఇప్పుడామే స్థానంలో కాజల్ వచ్చిచేరిందివంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకొంది. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రం కోసం హైద్రాబాద్ లో ఓ ప్రత్యేక మైన సెట్ కూడా వేస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీహరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం అందించనున్నారు
No comments:
Post a Comment