ఇంద్రుడితో రంభ పెళ్లి?

పేరుకు తగ్గట్టే మూడు పదులు దాటిన ప్రాయంలోనూ కుర్రకారుని తన గ్లామర్ తో అలరిస్తున్న నటి రంభ త్వరలోనే పెళ్లి పీటల మీద కూర్చోనుంది. కొద్ది రోజులుగా ఈ వార్త ప్రచారంలో ఉన్నప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 27న తిరుపతిలో రంభ పెళ్లి జరగనుంది. కెనడాకు చెందిన ఇంద్రన్ అనే బిజినెస్ మన్ తో ఈ వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని సమాచారం.విజయలక్ష్మి అలియాస్ రంభ ఇంతవరకూ 100కు పైగా చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, భోజ్ పురి సినిమాలతో పాటు 'జుర్మానా', 'జంగ్', 'జుద్వా', 'ఘర్ వాలీ బాహర్ వాలి' వంటి పలు హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన రంభ ఆ తర్వాత చిరంజీవి (హిట్లర్, బావగారూ బాగున్నారా, ఇద్దరు మిత్రులు), బాలకృష్ణ (భైరవద్వీపం), వెంకటేష్ (ముద్దుల ప్రియుడు) వంటి అగ్రహీరోలతో పాటు ఇటీవల అల్లు అర్జున్ (దేశముదురు), ఎన్టీఆర్ (యమదొంగ) చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లోనూ అలరించింది. తమిళంలో 'అరుణాచలం', 'ఉల్లత్తై అల్లిత్తా' వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఆమధ్య నిర్మాతగా మారి తమిళంలో 'త్రీ రోజెస్' అనే చిత్రాన్ని నిర్మించారు. అయితే ఆ చిత్రం నష్టాలను తెచ్చిపెట్టడంతో రంభ నటిగా మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్రమంగా బిజీ అవుతూ వచ్చింది. రంభ కథానాయికగా ఆయన సోదరుడు తెలుగులో నిర్మిస్తున్న 'ప్రతిక్షణం' చిత్రం విడుదల కావలసింది. ఈమధ్యనే 'క్విక్ గన్ మురుగన్' అనే హాలీవుడ్ చిత్రంలో రంభ నటించడంతో మళ్లీ ఒకసారి ఆమే పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో కెనడాకు చెందిన 'మ్యాజిక్ వుడ్స్' సంస్థ తమ సరికొత్త ప్రోడక్ట్ కు రంభను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసి తమ సరికొత్త ప్రోడక్ట్ అయిన కోటిన్నర రూపాయలు విలువ చేసే ఖరీదైన కారును అందజేసింది. ఆ కంపెనీకి చెందిన ఇంద్రన్ తోనే ఇప్పుడు పెళ్లి కూడా సెటిల్ అయినట్టు కోలీవుడ్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఇంద్రుడి కొలువుకు రంభే ప్రధాన ఎట్రాక్షన్ అయినట్టు...ఈ ఇద్దరి పేర్లూ బాగా కలిసిరావడం కూడా ముచ్చటైన విషయమే.

No comments:

Post a Comment