'ఆర్య-2' రివ్యూ

జనరేషన్లు మారినా యూత్ లో దూకుడు ఒకేలా ఉంటుంది. ప్రేమ, స్నేహం...ఈ రెండు విషయాల్లో ఎవరు ఏం చెప్పినా వినడానికి ఇష్టపడరు. ఒకవేళ విన్నట్టు కనిపించినా చివరకు తమకు నచ్చినదే చేస్తారు. ఇవాల్టి సినిమా రాజ పోషకులు కూడా వీరే కావడంతో ఆ రెండు అంశాలతో ఇబ్బడి ముబ్బడి సినిమాలకు ఎప్పుడూ కొదవుండదు. ప్రేమ, స్నేహం ఈ రెండిటికీ ముడిపెట్టి....'ఆర్య లాంటి ఫ్రెండ్ ఉండే ఇక శత్రువులు అక్కర్లేదు' అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథాంశమే 'ఆర్య-2'. ఇది అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో విజయవంతమైన 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గానే మొదట్నించీ ప్రచారం జరిగింది. అయితే తాజా వెర్షన్ లో ఆర్య పాత్ర మినహా మిగిలిన పాత్రలన్నీ వేటికవే భిన్నంగా ఉంటాయనీ, ఎంతమాత్రం సీక్వెల్ కాదని దర్శకనిర్మాతలు విస్తృత ప్రచారమే చేశారు. సహజంగానే సీక్వెల్స్ కు తెలుగులో అంత ఫాలోయింగ్ కానీ, సక్సెస్ లు దక్కిన రికార్డు కానీ లేదు. అయితే 'ఆర్య-2' వచ్చిన క్రేజ్ వేరు. తొలి వెర్షన్ లోని అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ పునరావృతం కావడంతో ఈసారి కూడా ఒకప్పటి బాక్సాఫీస్ మ్యాజిక్ తప్పదనే బలమైన అంచనాలు మాత్రం నెలకొన్నాయి. సుకుమార్ శిల్పం చెక్కినట్టు దాదాపు ఏడాది పాటు చెక్కడం వల్లనో, ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనలను ఇన్ కార్పొరేట్ చేయడం వల్లనో కానీ ప్రధాన జంట క్యారెక్టరైజేషన్ లో కొంత గందరగోళం చోటుచేసుకుంది. ఒకవైపు స్నేహితుడు...మరోవైపు లవర్. ఇద్దర్నీ హీరో కావాలంటాడు. రెండింటి విషయంలోనూ ఒకేలా అతని ఆలోచనా ధోరణి ఉంటుంది. ఒక్కోసారి ఆ పాత్రలో 'సైకో' ప్రవేశిస్తాడు. మరోసారి ట్రూ లవర్ బైట కొస్తాడు. తనకు దక్కకుండా జారిపోతోందంటే మానసికంగా దెబ్బతిన్న వ్యక్తిలా అయిపోతాడు. 'గే' పోలికలూ ఆ క్యారెక్టర్ లో కనిపిస్తాయి. ఈ తరహా క్యారెక్టరైజన్ వల్ల ప్రేక్షకులకు...ముఖ్యంగా ముందే చెప్పుకున్న యూత్ ఆడియెన్స్ కు ఎలాంటి సంకేతాలు పోతాయనేది దర్శకుడే చెప్పాలి. సందేశాలు ఇవ్వడానికో, పర్సులు ఖాళీ చేసుకోవడాకో సినిమాలు తీయడం లేదని చెప్పదలచుకుంటే సుకుమారే రైట్ కావచ్చు. మరింత లోతుపాతుల్లోకి వెళితే...

No comments:

Post a Comment