తమిళ స్టార్ ల ఔదార్యం

వెండితెర సాక్షిగా తమను ఆరాధించే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తామంతా కలిసి సాయం అందిస్తామని 'స్టార్ నైట్'లో పాల్గొన్న తారలంతా చాటుకున్నారు. భాషాభేదాలు, ప్రాంతీయ తారతమ్యాలు మరిచి అంతా ఒక నోబుల్ కాజ్ కోసం హాజరుకావడంతో ఈ కార్యక్రమానికే వన్నెతెచ్చింది. తెలుగు పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, రాధారవి, సూర్య, కన్నడ హీరో సుదీప్ తదితరులు పాల్గొని తమ సంఘీభావం చాటారు
చెన్నై నుంచి నేరుగా స్టార్ నైట్ కు వచ్చిన రజనీకాంత్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, గురువు దాసరి నారాయణరావు గారు తనను ఈ ఈవెంట్ కు ఆహ్వానించారనీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా తాను మందుంటానని తాను చెప్పడం, ఈ కార్యక్రమానికి హాజరుకావడం చాలా సంతోషంగా ఉందనీ అన్నారు. ఒక నోబుల్ కాజ్ కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని సూర్య పేర్కొన్నారు. సూర్య రూ.5 లక్షల సాయాన్ని ప్రకటించారు. తమిళ నటుడు విజయ్ 2 లక్షలు, విశాల్ 2.5 లక్షలు, జయం రవి 1 లక్ష, తమిళనాడు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 10 లక్షలు ప్రకటించారు. వీరితో పాటు హీరోయిన్లు జెనీలియా 2 లక్షలు, ప్రియమణి 1 లక్ష ప్రకటించారు

No comments:

Post a Comment