బాలకృష్ణ 'సింహా' సంక్రాంతికి

ఈసారి 2010 సంక్రాంతి మరింత కలర్ ఫుల్ గా ఉండబోతోంది. ఆసక్తికరంగా టాప్ హీరోలైన వెంకటేష్ నటిస్తున్న 'నమో వెంకటేశ', నాగార్జున తో కామాక్షి మూవీస్ నిర్మిస్తున్న చిత్రం సంక్రాంతి బరిలో దిగుతున్నట్టు ఆ చిత్రాల నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా టాప్ హీరోల్లో మరొకరైన నందమూరి బాలకృష్ణ సైతం సంక్రాంతికి 'సింహా' చిత్రంతో రాబోతున్నారు. ఈ విషయాన్ని 'సింహా' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.మహేంద్రబాబు తెలియజేశారు.బాలకృష్ణ, స్నేహ ఉల్లాల్, నమిత హీరోహీరోయిన్లుగా 'సింహా' చిత్రం తెరకెక్కుతోంది. 'భద్ర', 'తులసి' వంటి హిట్ చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా హైద్రాబాద్ లో జరుగుతోందనీ, ఈ నెలాఖరు వరకూ ఇక్కడే షూటింగ్ జరిపి ఆ తర్వాత వైజాగ్ లో కొంత షూటింగ్ చేస్తామని మహేంద్రబాబు తెలిపారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రఘు, కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్, కె.ఆర్.విజయ, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఆలీ, ధర్మవరపు, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరామ్, సైరాబాను, మలయాళ విలన్ సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం బాలకృష్ణ అందిస్తున్న ఈ చిత్రానికి స్టన్ శివ ఫైట్స్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు

No comments:

Post a Comment