skip to main |
skip to sidebar
చిరంజీవి, అల్లు అర్జున్ ల మధ్య పోటీ కొద్దిలో తప్పింది. టైటిల్ లో చిరంజీవి పేరున్న 'మా నాన్న చిరంజీవి', చిరంజీవి ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ 'ఆర్య-2' చిత్రాలు తొలుత ఈనెల 25న విడుదల తేదీలు ప్రకటించడంతో ఈ పోటీ రసవత్తరంగా ఉండబోతోందనే ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు ఆ ఉత్సుకతకు తెరపడింది. 'ఆర్య-2' చిత్రం 27వ తేదీన ముహూర్తం ఖరారు చేసుకుంది. దీంతో 'మా నాన్న చిరంజీవి' డిసెంబర్ నెలకు షిఫ్ట్ అయింది.జగపతిబాబు కథానాయకుడు లాఫింగ్ లార్డ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై 'మా నాన్న చిరంజీవి' (అంటే పెద్ద హీరో) తెరకెక్కింది. అరుణ్ ప్రసాద్ ('తమ్ముడు' ఫేమ్) దర్శకుడు. ఇందులో జగపతిబాబు క్యారెక్టర్ పేరు చిరంజీవులు. ఆయన కొడుక్కి (మాస్టర్ అతులిత్)కు మాత్రం హీరో. జీవితంలో ఎన్ని ఇబ్బందులొచ్చినా నవ్వుతూ ముందుకు సాగాలనే కాన్సెప్ట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సినిమా కథ వినగానే ఇది అరుణ్ ప్రసాద్ ఎలా హ్యాండిల్ చేస్తారో అనుకున్నాననీ, ఫినిషింగ్ కు వచ్చేసరికి ఆయన ఇచ్చిన ప్రోడక్ట్ అద్భుతంగా వచ్చిందనీ, మళ్లీ అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాననీ జగపతిబాబు చెబుతున్నారు. ప్రస్తుతం రిలీజ్ తేదీలో మార్పు జరిగిన ఈ చిత్రం డిసెంబర్ మొదటివారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆసక్తికరంగా జగపతిబాబు నటించిన 'ప్రవరాఖ్యుడు' సైతం డిసెంబర్ ను టార్గెట్ చేసుకుని రీలీజ్ కు రెడీ అవుతోంది.
No comments:
Post a Comment