యుఎస్ లో 'స్టార్ నైట్' లైవ్

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన వరదల్లో బాధితులైన వారిని అదుకునేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సారథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్వహించనున్న స్టార్ నైట్ 'స్పందన' కార్యక్రమాన్ని అమెరికాలో బిగి సినిమా ప్రత్యక్ష ప్రసారం (లైవ్) చేయనుంది. టీవీ-9 అమెరికా అసోసియేషన్ తో ఈ లైవ్ బ్రాడ్ కాస్ట్ జరుగుతుంది. హైద్రాబాద్ లోని గచ్చీబౌలీ ఇండోర్ స్టేడియంలో ఈ శనివారం సాయంత్రం స్టార్ నైట్ నిర్వహించనున్నారు
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ తారలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని పలు ప్రదర్శనలు ఇస్తారు. హిందీ, తమిళ, కన్నడ పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 70 థియేటర్లతో పాటు అమెరికాలోని రెండు థియేటర్లలో ఈ ఈవెంట్ ను లైవ్ బ్రాడ్ కాస్ట్ చేయనున్నారు. 'స్పందన' కార్యక్రమంలో తొలుత వరద ప్రాంతాల క్లిప్పింగ్స్ ను ప్రదర్శిస్తారు. అనంతరం అనంత శ్రీరాం సాహిత్యంలో ఎం.ఎం.కీరవాణి సంగీతం, నేపథ్యగానం అందించిన ఆహ్వాన గీతంతో కార్యక్రమం ప్రారంభమమవుతుంది. అలాగే మ్యూజికల్ నైట్ లో 14 మంది సంగీత దర్శకులు, 25 మంది గాయనీగాయకులు పాల్గొంటారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని డిజిటల్ ప్రొజెక్టర్ల ద్వారా బిగ్ సినిమాస్ టెలికాస్ట్ చేస్తుంది. టిక్కెట్ల అమ్మకాల ద్వారా వచ్చే మొత్తాన్ని వరద బాధితులకు అందజేస్తారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఇతర సమాచారం కోసం Raman Sanchula at sanchula@yahoo.com or (408) 464-4788ను సంప్రదించవచ్చు.

No comments:

Post a Comment