సంక్రాంతి ముందే సినీ మేలా

సంక్రాంతి వచ్చిందంటే పోటాపోటీ సినీ మేలా షురూ అవుతుంది. అయితే 2010 సంక్రాంతి మేలా కంటే ముందే ఈ ఏడాది డిసెంబర్ లో అగ్ర హీరోలు, యువకథానాయకులు బరిలోకి దూకేస్తున్నారు. ఇవాళ...రేపు అంటూ రిలీజ్ కు మీనమేషాలు లెక్కిస్తున్న పలు చిత్రాలన్నీ డిసెంబర్ మాసాన్ని టార్గెట్ చేసుకోవడంతో డబ్బింగ్ సినిమాలతో కలిసి దాదాపు రెండు డజన్ల సినిమాలు ఇదే సీజన్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఏడాదిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ 'ఆర్య-2' చిత్రం రిలీజ్ డేట్ కన్ ఫర్మ కాడవంతో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పలు చిత్రాలు సైతం తమ రీలీజ్ తేదీలను సవరించుకుంటూ డిసెంబర్ మొదటివారానికి జంప్ అవుతున్నాయి. అదే నెల మూడు, నాలుగు వారాల్లో క్రిస్మస్ కానుకగా పలు పెద్ద చిత్రాలు కూడా పోటీపడుతున్నాయి. ఈ సీజన్ లో హిట్ అయితే సంక్రాంతి సీజన్ లోకూ ఈ హవా కొనసాగుతుందని ఫిల్మ్ మేకర్స్ బలంగా విశ్వసిస్తుంటారు. సంక్రాంతి బరిలో ఇప్పటికే విక్టరీ వెంకటేష్ 'నమో వెంకటేశ', నాగార్జున 'మోసగాడు' (టైటిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) చిత్రాలు కన్ ఫర్మ్ అయ్యాయి.

No comments:

Post a Comment