skip to main |
skip to sidebar
రిష్మా కోటక్ (శంకర్ దాదా జిందాబాద్) ప్రధాన పాత్రలో జనం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'గ్లామర్'. సీనీ గ్లామర్ ఫీల్డ్ పై సంధిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.సత్యారెడ్డి ఆ విశేషాలను తెలియజేస్తూ, అవగాహన లేకుండా పరిశ్రమలోకి వచ్చే నూతన నటీనటులకు ఎదురయ్యే ఇబ్బందులు, పరిస్థితులను ఆవిష్కరిస్తూ ఈ చిత్రం తెరకెక్కించామనీ, కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చే వాళ్లకు డిక్షనరీ లా ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. ఇటీవల నాగార్జున సాగర్ లో 2 లాంచీలలో నాలుగు రోజుల పాటు కరిష్మా కోఠక్ పై చిత్రీకరించిన పాట సినిమాకి హైలైట్ గా నిలుస్తుందన్నారు. ఈ నెల 25న సినీ ప్రముఖుల సమక్షంలో లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేయనున్నట్టు చెప్పారు. డిసెంబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, జీవా, కొంమడవలస, గుండు హనుమంతరావు, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్నారు. శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, బాంబే రవి సంగీతం అందిస్తున్నారు
No comments:
Post a Comment