గుడుగుడుగుంజం'

'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' తరువాత నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా 'గుడుగుడుగుంజం' అని నిర్మాత వి.రవికుమార్ రెడ్డి తెలిపారు. 'గుడుగుడుగుంజం... గుండేరాగం, పావుల పట్నం పడగేరాగం...' ఇది చిన్నపిల్లలాట... పిడికిలి బిగించి ఆటే ఈ ఆటని ఒకవేళ పెద్దలు గుప్పెట్లో నిజం దాచుకొని ఆడితే ఎలా ఉంటుందనే చిలిపి ఆలోచనతో అల్లిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'గుడుగుడుగుంజం'లో రాజేంద్రప్రసాద్, కస్తూరి, సితార మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ నాయికా, నాయకులుగా, పార్ధు(నవదీప్ బ్రదర్), చాహత్, రిథిమ, ఆర్తి యువ జంగా కామెడీని పండించారు. క్లయిమాక్స్, పిక్నిక్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్లో ఎడిటింగ్, డబ్బింగ్, రీ-రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ లో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.

నవ్వులరేడు రాంజేద్రప్రసాద్ నటించిన 'లేడీస్ టైలర్', 'ఏప్రిల్ ఒకటి విడుదల' వంటి కామెడీ సినిమాల లిస్ట్ లో ఈ 'గుడిగుడిగుంజం' చేరుతుందనే గట్టి విశ్వాసాన్ని చాలా మంది వ్యక్తపరిచారని నిర్మాత అన్నారు. డా.బ్రహ్మానందం, రఘుబాబు మరో కామెడీ హీరోయిన్ తో సినిమాకు హైలెట్ గా నిలిచే కామెడీ ట్రాక్ తియ్యడానికి మరోసారి బ్యాకాంగ్ వెళ్తున్నామని, బ్యాకాంగ్ లో చిత్రీకరించిన మూడు పాటలు యువతరానికి కనువిందు చేసేలా డ్యాన్స్ మాస్టర్ ప్రసన్న రూపొందించారని, ప్రస్తుతం సి.జీ.ఆప్టికల్ వర్గ్ జరుగుతుందని దర్శకులు తెలిపారు. సుప్రీమ్ ఆడియో ద్వారా త్వరలో పాటలను విడుదుల చేస్తున్నామని అన్నారు. ఇటీవల కాలంలో జల్సా, ఆర్య2 వంటి కొన్ని పాటలు ఆడియో విడుదల కంటే ముందే నెట్ లో చోటు చేసుకోని పాపులర్ అవ్వడం దృష్ట్యా తామే అఫీషియల్ గా నవంబర్ 14న గోయర్స్ వెబ్ సైట్ ద్వారా ఆడియో విడుదలకు ముందే ఓ పాటను విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. సుమన్, ఎమ్.ఎస్ నారాయణ, కృష్ణభగవాన్, కొండవలస, తెలంగాణ శకుంతల, గుండు సుదర్శన్, సితార, కస్తూరి, పార్థు, షారాఖాన్ తదితర తారాగణం నటించగా... స్క్రీన్ ప్లే మరుధూరి రాజా, పాటలు కులశేఖర్, మాటలు నంద్యాల రవి, కెమెరా మధు.ఎ.నాయుడు, డాన్స్ ప్రస్నన్న, నిర్మాత వి.రవికుమార్.

No comments:

Post a Comment