ఫిలిం చాంబర్ కు 'టి' సెగలు

డెబ్బై ఐదేళ్లకు పైబడిన చరిత్ర కలిగిన తెలుగు సినీ చిత్ర పరిశ్రమ ఇంతకు మునుపెన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై తలెత్తిన ఆందోళన టాలీవుడ్ ను అతలాకుతలం చేస్తోంది. పరిస్థితిని సమీక్షించి పరిశ్రమకు అండగా నిలవాల్సిన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సైతం 'మీనమేషాలు' లెక్కిస్తుండటం ఈ సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం చాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారంనాడు సమావేశం కావాల్సి ఉండగా అది కూడా రద్దయింది.సినిమాలపై బ్యాన్ పెట్టడం, షూటింగ్ లను అడ్డుకోవడం వంటి ఆందోళనకర సంఘటనల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించారు. అయితే ఈ సమావేశం రద్దు కావడం పరిశ్రమలోని పలువురుని తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోంది. చాంబర్ మీటింగ్ రద్దు కావడం ఇది రెండోసారి. టిఆర్ఎస్ నాయకుడు టి.చంద్రశేఖర్ రావు నిరవధిక దీక్ష నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందులను సమీక్షిచేందుకు గత నవంబర్ లో చాంబర్ సమవేశం కావాలని అనుకున్నప్పటికీ చివరి నిమషంలో రద్దయింది

No comments:

Post a Comment