30 కోట్లకు చేరువలో 'ఆర్య 2'

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఆర్య-2' చిత్రానికి నైజాం ఏరియాలో ప్రతిఘటన ఏర్పటినప్పటికీ రాబోయే రోజుల్లో ఈ చిత్రం 30 కోట్ల వరకూ కలెక్షన్ వసూలు చేయనుంది. తెలంగాణ ఆందోళనల నేపథ్యంలో అల్లు అర్జున్ కు మంచి పట్టు ఉన్న నైజాం ఏరియాలో ఈ చిత్ర ప్రదర్శనను ఆందోళన కారులు అడ్డుకున్నారు. దీంతో సినిమా బాక్స్ లను నిర్మాత ఆదిత్యబాబు వెనక్కి తెప్పించుకున్నారు. పరిస్థితి చక్కబడిన వెంటనే మళ్లీ రిలీజ్ ఉంటుందని ఆయన తెలిపారు.నైజాం ఏరియాలో సినిమా ప్రదర్శనను నిలిపివేసే సమయానికి 6.5 కోట్ల వరకూ రాబట్టింది. సీడెడ్ లో బంద్ పలురోజులు సాగడంతో 4 కోట్ల గ్రాస్ రాబట్టుకుంది. ఇందులో వైజాగ్ ఏరియాలో 1.60 కోట్లు వసూలయ్యాయి. గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో 1.08 నుంచి 1.27 కోట్ల వరకూ వసూలైంది. కర్ణాటక మార్కెట్ నుంచి 1.90 కోట్లు, చెన్నై, నార్త్ ఇండియా నుంచి 50 లక్షల కలెక్షన్ ఆశిస్తున్నారు.బంద్ లు, ప్రదర్శనల నిలిపివేత కారణంగా దాదాపు 6 నుంచి 8 కోట్ల వరకూ నష్టపోయినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆడియో రైట్స్, కేరళ రిలీజ్ , ఓవర్సీస్ కలెక్షన్లు కలిసి దాదాపు 7 కోట్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. రాబోయే న్యూఇయర్, సంక్రాంతి సీజన్ లు కూడా మరిన్ని కలెక్షన్లు తెచ్చిపెడతాయని నిర్మాతలు ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం థియేటర్ కలెక్షన్లు21 కోట్లకు చేరుకున్నాయనీ, ఓవరాల్ రెవెన్యూ త్వరలోనే 30 కోట్లకు చేరుకుంటుందని చెబుతున్నారు. దీంతో 'మగధీర', 'అరుంధతి' చిత్రాల తర్వాత హయ్యెస్ట్ గ్రాసర్ గా 'ఆర్య-2' నిలిచే అవకాశాలున్నాయి.

No comments:

Post a Comment